హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. బీజేపీ ఆఫీసు వద్ద భారీగా పోలీసుల మోహరింపు

by Kema Shiva Kumar |

హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. నిన్న గాంధీ భవన్‌లో నిర్వహించిన పీసీసీ (PCC) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని ప్రశ్నించారు.

హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. బీజేపీ ఆఫీసు వద్ద భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. నిన్న గాంధీ భవన్‌లో నిర్వహించిన పీసీసీ (PCC) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలను నిరసనగా యువ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను అక్కడే అడ్డుకునేలా బీజేపీ ఆఫీసుకు ఇరువైపులా బారికేడ్లతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

సీఎం వ్యాఖ్యలు ఇలా..

హిందువుల్లో మూడు కోట్ల మంది ఉన్నారని.. పెళ్లి చేసుకోనివాళ్లకు హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునేటోళ్లకు ఇంకొక దేవుడున్నారని రేవంత్ అన్నారు. తాగేటోళ్లకు ఎల్లమ్మ, పోచమ్మ, కల్లు పోయాలి, కోడి కోయాలి అనేటోళ్లకు మరో దేవుడున్నారని కామెంట్ చేశారు. పప్పన్నం తినేటోళ్లకు కూడా దేవుడున్నాడని.. ఇలా అన్ని రకాల దేవుళ్లున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులున్నారని.. దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదన్నారు. ఒకాయన వేంకటేశ్వర స్వామికి మొక్కుతానంటే, మరొకాయన ఆంజనేయస్వామికి మొక్కుతా అటాడని.. ఇంకొకాయన లేదు.. లేదు నేను అయ్యప్పమాల వేస్తానంటే, మరో ఆయన శివమాల వేస్తానంటాడని అన్నారు. దేవుళ్ల మీదే మనం ఏకాభిప్రాయం తీసుకురానప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉండదని తాను అనుకోవట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story