- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress: టీ కాంగ్రెస్‌లో హాట్ పాలిటిక్స్! రేపు పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలు కాకరేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికార కాంగ్రెస్ (T Congress) పార్టీలోని పరిణామాలు కాకరేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో (Congress MLAs) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భేటీ కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగబోయే ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హాజరుకానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం నాలుగు గ్రూపులుగా విడదీసి వారితో సీఎం భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశం కోసం దీపా దాస్‌మున్షీ (Deepadas Munshi) ఇవాళ సాయంత్రం లేదా రేపు రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల రహస్య భేటీ విషయంలో పార్టీలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా భేటీ కావడం కంటే పార్టీ పరంగా ఎమ్మెల్యేలందరితో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ, ప్రభుత్వం పరంగా వారికున్న ఉన్న సమస్యలు చర్చించాలనే అభిప్రాయానికి హస్తం పార్టీ పెద్దలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
దానం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయ్యారు. స్పీకర్ కార్యాలయం నోటీసుల విషయంలో ఏం చేయాలి? అసెంబ్లీ సెక్రటరీకి, సుప్రీంకోర్టుకు ఏం సమాధానం ఇవ్వాలి..? అనే అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో లీగల్‌గా ఉన్న అంశాలు ఏమిటి అనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం.






