CM Revanth Reddy : మరికొద్దిసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్... బనకచర్ల పంచాయితీ కోసమేనా?

by Muthe.Rajitha |   (  Updated:2025-07-15 15:47:04  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరికొద్దిసేపట్లో ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారని సమాచారం.

CM Revanth Reddy : మరికొద్దిసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్... బనకచర్ల పంచాయితీ కోసమేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరికొద్దిసేపట్లో ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారని సమాచారం. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల వివాదం(Banakacharla Issue)పై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సుముఖంగా ఉండగా.., తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము వచ్చేది లేదని తెలియజేశారు. అయితే ఈ సమావేశం ఎజెండా మారిస్తే తాము కూడా హాజరవుతామని కేంద్రమంత్రికి సీఎం రేవంత్ తెలపగా.. ఈ హుటాహుటి ప్రయాణానికి కారణం మాత్రం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశమేనని రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.

కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబీపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన అంశాలు సమావేశపు ఎజెండాలో చేర్చాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలను పంపించింది.

Next Story