భారీ వర్షాలపై మరోసారి సీఎం రేవంత్ సమీక్ష.. కేంద్రానికి నివేదిక పంపే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-29 05:00:23  IST  )

తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని వరుస వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

భారీ వర్షాలపై మరోసారి సీఎం రేవంత్ సమీక్ష.. కేంద్రానికి నివేదిక పంపే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని వరుస వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కామారెడ్డి (Kamareddy), మెదక్‌ (Medak)తో పాటు మరికొన్ని జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడకక్కడ జన జీవనం స్తంభించిపోయి.. అష్టకష్టాలు పడుతున్నారు. ఇక అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేసిన పంట అంతా వరద తాకిడికి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై కాసేపట్లో ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొననున్నారు. వరదల వల్ల ఆస్తి, పంట, ప్రాణ నష్టంపై సీఎం అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా వరద ప్రభావిత జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులను నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. వరదల నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను ఈ సమీక్షలో చర్చించి ఆ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లుగా సమాచారం.

Next Story