అందెశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సతీమణి

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్ర‌గీతం ర‌చ‌యిత అందెశ్రీ ఇటీవ‌ల మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి స‌తీమ‌ణి లాలాపేట‌లోని అందెశ్రీ ఇంటికి వెళ్లి వారి కుటంబాన్ని ప‌రామ‌ర్శించారు. గీతా రెడ్డితో పాటు వారి కూతురు, డిప్యూటీ మేయ‌ర్ మోతే శ్రీల‌త శోభ‌న్ రెడ్డి కూడా ఉన్నారు.

అందెశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సతీమణి
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర‌గీతం ర‌చ‌యిత అందెశ్రీ ఇటీవ‌ల మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి స‌తీమ‌ణి లాలాపేట‌లోని అందెశ్రీ ఇంటికి వెళ్లి వారి కుటంబాన్ని ప‌రామ‌ర్శించారు. గీతా రెడ్డితో పాటు వారి కూతురు, డిప్యూటీ మేయ‌ర్ మోతే శ్రీల‌త శోభ‌న్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా అందెశ్రీ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వారిని ఓదార్చారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అందెశ్రీ కుటుంబానికి అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే అందెశ్రీకి సీఎం రేవంత్ రెడ్డితో ప్ర‌త్యేక అనుబంధం ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో అందెశ్రీని ఇంటికి ఆహ్వానించి రేవంత్ రెడ్డి దంప‌తులు స‌న్మానించారు. అందెశ్రీ చ‌నిపోయిన త‌ర‌వాత సైతం రేవంత్ రెడ్డి స్వ‌యంగా అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు. అక్క‌డితో ఆగ‌కుండా అందెశ్రీ పాడెను మోశారు. ఇక ఇప్పుడు గీతారెడ్డి స్వ‌యంగా ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించ‌డం విశేషం.

Next Story