వారికి మరోసారి పదవి దక్కే అవకాశమే లేదు.. CM రేవంత్ మాస్ వార్నింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-28 15:34:58  IST  )

ఎన్నికల ముందు కష్టపడిన వారికి కాంగ్రెస్ అధికారం(Congress Govt)లోకి వచ్చాక పదువులు ఇచ్చాం.. కేసులు ఎదుర్కొని పనిచేసిన వారికి 80 శాతం వరకు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

వారికి మరోసారి పదవి దక్కే అవకాశమే లేదు.. CM రేవంత్ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు కష్టపడిన వారికి కాంగ్రెస్ అధికారం(Congress Govt)లోకి వచ్చాక పదువులు ఇచ్చాం.. కేసులు ఎదుర్కొని పనిచేసిన వారికి 80 శాతం వరకు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదవులు రాని వాళ్లు నిరాశ చెందవద్దని.. మరో విడతలో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేయకపోతే కార్పొరేషన్ చైర్మన్ల(Corporation Chairmen)కు పదవిగండం తప్పదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని తొలగించడమే కాకుండా.. రెన్యూవల్ కూడా చేయబోమని తేల్చి చెప్పారు.

వారికి ఇదే చివరి పదవి అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు వచ్చిన వారు, పదవులు రాని వారికి మధ్య గ్యాప్ ఉంది.. కార్యకర్తల మధ్య గ్యాప్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని అన్నారు. ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా నేతలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎంత చెప్పుకున్నా తరగనంత సక్సెస్ స్టోరీ మనకుంది.. తెలంగాణలో కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. పక్కాగా కులగణన(Caste Census) చేశామని చెప్పారు. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానమంత్రిని చేసే వరకూ మనం విశ్రమించొద్దని అన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దు. రాహుల్‌ ప్రధాని అయితే, దేశం అభివృద్ధి అవుతుందని చెప్పారు. దేశంలోనే అత్యధిక పన్నులు కడుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

Next Story