- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా విజన్ అదే’.. వారికి క్లియర్‌గా చెప్పిన CM రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్‌లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని(Sony Headquarters) సందర్శించింది.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్‌లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని(Sony Headquarters) సందర్శించింది. సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసింది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. ఉత్పత్తులతో పాటు వారి పని తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన బృందానికి వివరించారు. ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్‌పై వివరణాత్మక చర్చలు జరిపింది. యానిమేషన్, వీఎఫ్ఐ మరియు గేమింగ్ రంగాలలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది.
ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భవిష్యత్తు విజన్‌ను వారితో పంచుకున్నారు. కాగా, అంతకుముందు.. సీఎం రేవంత్ రెడ్డి బృందం మారుబెనీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయింది. సుదీర్ఘ చర్చల అనంతరం జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. దాదాపు రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది.






