- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ పేరు మార్చిన CM రేవంత్.. యాదగిరిగుట్ట వేదికగా కొత్త పేరు ప్రకటన
బీఆర్ఎస్(BRS) నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపన చేశారు. అనంతరం తిరుమలాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనర్సింహాస్వామి ఆశీస్సులతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటైందని అన్నారు. గతంలో యాదగిరిగుట్ట పేరు మార్చి యాదాద్రి చేశారు.. తాము అధికారంలోకి వస్తే మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పాం.. చెప్పినట్లే చేశామని గుర్తుచేశారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయంలో పనులు చేపట్టామని అన్నారు. గత పదేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఇటీవల నా బర్త్ డే రోజున సంబురాలు చేసుకోకుండా.. మూసీ(Musi) ప్రాంత ప్రజల కష్టాలు చూసేందుకు వచ్చాను.. వారి కష్టాలు చూసి చలించిపోయాం.. అందుకే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని మాటిచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించామని అన్నారు.
గుజరాత్‌లో సబర్మతి, యూపీలో యమునా నదిని డెవలప్ చేసుకున్నారు.. తాము మూసీని డెవలప్ చేసుకుంటాం అనేసరికి ఏడ్చి గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవద్దా.. మేము ఇంకా ఎన్నాళ్లు ఈ మూసీ మురికిలో ఉండాలని అడిగారు. నల్లగొండ జిల్లా ప్రజల బాధలు బీఆర్ఎస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాదు.. ఇప్పుడు అది డీఆర్ఎస్.. డీఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. అలాంటి దయ్యాలను పొలిమేరల వరకు తరిమి కొట్టాలి. దానికి నల్లగొండ జిల్లా ప్రజల సహకారం కావాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అందరు కాంగ్రెస్ నేతలను 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వడం స్టార్ట్ చేశాం.. గతంలో కూడా ఫస్ట్ తారీఖున జీతాలు వచ్చినట్లు మీరు నిర్ధారిస్తే వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయకండి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి.. తెలంగాణను బొందలగడ్డ నుంచి ప్రతీ వెధవ ఇప్పుడు తమకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. యాదగిరిగుట్టలో అపచారం వల్లే గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకున్నది.. చేసిన పాపాల వల్లే కిందపడి మక్కెలు విరిగాయని కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాసాలమర్రిని ఆగమాగం చేశారు.. ఆ గ్రామాన్ని సరిచేసే బాధ్యత తాము తీసుకుంటామని ప్రకటించారు.






