- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ కొంప ముంచేది ఆ ఇద్దరే.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ కొంప ముంచేది ఆ ఇద్దరే.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేవరకొండ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చెప్పారు. నిజాం రజాకార్లను తరిమికొట్టిన ప్రాంతం నల్లగొండ ప్రాంతం అని అన్నారు. నల్లగొండ గాలికి, నీటికి పోరాట పటిమ ఉందని తెలిపారు. ఓటు అనే ఆయుధంతో గడీలను బద్దలు కొట్టారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు వెళుతున్నామని అన్నారు. కొత్త రేషన్ కార్డులతో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేశామని తెలిపారు. తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పేదలకు రేషన్ దుకాణం ద్వారా సన్నబియ్యం ఇవ్వడం లేదని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనా గుజరాత్‌లో కూడా సన్నబియ్యం ఇవ్వడం లేదని గుర్తుచేశారు. దేవరకొండ నుంచి మీద నుంచి బీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మీరిచ్చారో.. ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చామో గ్రామాల్లోకి వెళ్లి తేల్చుకుందామని సవాల్ చేశారు. పదేళ్లు అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. అందుకే అంతా ఏకతాటిమీదకు వచ్చి తెలంగాణ ప్రజలను పట్టిపీడించిన నాయకులను ఓడించామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, 60 వేలకు పైగా ఉద్యోగాలు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు, రేషన్ కార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే రెండేళ్లలోనే ఎన్నో పనులు చేశామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల ఇళ్లలో వెలుగులు నిండాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకుపైగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.22 వేల 500 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఎస్టీల రిజర్వేషన్లపై కొందరు కుట్రలు చేస్తున్నారు. ఆదివాసీ, లంబాడీల మధ్య గొడవ పెట్టారు.. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న కేసీఆర్ ఇద్దరు సర్పంచులు, ముగ్గురు వార్డు మెంబర్లతో సమావేశం అయ్యి.. మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని అంటుండు.. కేటీఆర్, హరీష్ రావు ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్‌కు మంచి రోజులు రావని అన్నారు. కేసీఆర్ కొంప ముంచేది ఆ ఇద్దరే అని హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు కేసీఆర్ ఎంతో ఘనంగా బతికారు.. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి కేసీఆర్‌ను రోడ్డు మీదకు లాగారు. పదేళ్ల పాలన సమయంలో కేబినెట్ మంత్రులను కూడా గడీ గేట్ దగ్గర నుంచే వెనక్కి పంపారని గుర్తుచేశారు.






