- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌పై మరోసారి రెచ్చిపోయిన CM రేవంత్.. నారాయణపేట్ సభలో సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు కేసీఆర్‌కు పదేళ్లు అవకాశం ఇచ్చారని.. ఆ పదేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru - Rangareddy Project) పూర్తి చేసి ఉంటే.. ఇవాళ ఏపీతో గొడవ ఉండేదే కాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టామని అన్నారు. తాము పాలమూరు పచ్చబడేలా పనులు చేస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు పాలమూరు ప్రజలే రాజకీయ భిక్ష పెట్టారని.. అయినా ఏమాత్రం విశ్వాసం లేకుండా పదేళ్లు పాలమూరును ఎండబెట్టారని సీరియస్ అయ్యారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్సే.. పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని కీలక ప్రకటన చేశారు.
ఈ ప్రాజెక్ట్ డిజైన్(Project Design) మార్చి ఏడాది పాటు పాలమూరు ప్రజలను కేసీఆర్ గోస పెట్టారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) చెప్పులు మోసి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు వెళ్లేలా చేసింది కేసీఆరే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్డీఎస్ ద్వారా అదనపు జలాలు తరలించినప్పుడు హరీష్ రావు వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ముచ్చుమర్రి కడుతుంటే కేసీఆర్ కళ్లు మూసుకుని కూర్చున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా కొట్టడం కాదు.. ముందు ఈ కార్ రేసులో అవినీతికి పాల్పడ్డ నీ కొడుకు కేటీఆర్(KTR), కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో దోచుకున్న నీ అల్లుడు హరీష్ రావు(Harish Rao)ను, లిక్కర్ కుంభకోణంతో తెలంగాణ పరువు తీసిన నీ కూతురు కవిత(Kavitha)ను కొట్టు ముందు అని కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ పాపాలే పాలమూరు ప్రజలకు శాపంగా మారాయని అన్నారు.
తాము అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణమాఫీ, ఆర్టీసీ(RTC)ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదిలోనే ఎన్నో పనులు చేశామని అన్నారు. దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఏ గ్రామంలో అయినా చర్చకు సిద్ధమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, చారిత్రాత్మక కులగణన చేసి చూపించామని అన్నారు.






