అక్కడికి వెళ్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు.. CM రేవంత్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

అక్కడికి వెళ్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు.. CM రేవంత్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. అణాపైసా అప్పుపుట్టడం లేదని అన్నారు. అప్పుల కోసం బ్యాంకుల వద్దకు వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా చెబితే ఎవరూ నమ్మడం లేదు.. కానీ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందని అన్నారు. స్వీయ నియంత్రణ మాత్రమే దీనికి సరైన పరిష్కారం అని అన్నారు. స్వీయ నియంత్రణ లేకపోతే రాష్ట్రం మరింత దివాళా తీయడం ఖాయమని అన్నారు. తాను నల్లమల బిడ్డను అని.. దోచుకునే స్వభావం తనది కాదని తెలిపారు. వ్యక్తిగత ఆదాయం తనకు అవసరం లేదని.. సీఎంగా పనిచేస్తున్నాను.. బాధ్యతగా ఉంటాను.. ఉన్నదే చెబుతా.. ఏదీ దాచిపెట్టను అని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఇప్పటివరకు ఎక్కడా దుబారా ఖర్చు చేయలేదని అన్నారు.. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇవ్వని విధంగా.. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని అన్నారు. ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దని సూచించారు. ఉద్యోగుల డిమాండ్ల కోసం ప్రజలపై సమరం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం ఆపి మీ డిమాండ్లు నెరవేర్చాలో చెప్పండి అని ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి అడిగారు.

కాగా, ఈనెల 7న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ(RTC JAC) సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌ వద్ద సోమవారం ప్రదర్శన చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని.. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీరితో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంపై సమరశంఖం పూరించాయి. ఈ సందర్భంగా ఉద్యోగుల డిమాండ్‌పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇది సరైన పద్దతి కాదని సీరియస్ అయ్యారు.

Next Story