కిటాక్యుషు నగరంలో సీఎం రేవంత్ రెడ్డి.. రైజింగ్ బృందానికి తెలుగులో ఘన స్వాగతం

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

కిటాక్యుషు నగరంలో సీఎం రేవంత్ రెడ్డి.. రైజింగ్ బృందానికి తెలుగులో ఘన స్వాగతం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ReddySridhar Babu) జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన కిటాక్యుషు (Kitakyushu City) నగరాన్ని సందర్శించారు. నగర మేయర్ కజుహిసా టకేచీ (Kazuhisa Takeuchi) తెలంగాణ బృందాన్ని అక్కడి సంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి డి. శ్రీధర్ బాబు (Sridhar Babu), అధికారులను మేయర్ ఘనంగా సత్కరించారు. మేయర్‌తో తెలంగాణ బృందం చర్చలు జరిపింది. చర్చల్లో భాగంగా త్వరలో మేజర్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సీఎంవో ఆఫీస్ వెల్లడించింది.

నగర సందర్శన పై మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేస్తూ.. వేల మైళ్ల దూరంలో తెలుగులో స్వాగత సందేశం నిజంగా నన్ను కదిలించింది.. భాష హృదయాలను కలుపుతుందని గుర్తుచేసే అందమైన జ్ఞాపకమని ట్వీట్ చేశారు. కాగా, కిటాక్యుషు (Kitakyushu) నగరానికి ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న ఈ నగరం కిటాక్యుషూ. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.

Next Story