- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: టీచర్లకు బిగ్ అలర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
విద్యాశాఖ రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్కూల్స్ టు యూనివర్సిటీల వరకు ప్రతి విద్యా సంస్థల్లోనూ మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ (Facial Recognition) హాజరు తప్పనిసరి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని ఈ విషయాన్ని నిర్ధారించేందుకు గత పదేళ్లలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. విద్యా శాఖపై ఇవాళ హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష (Education Department Review) నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగంపై పెడుతున్న ఖర్చును తాము పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు విద్యా రంగం అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్ బీఎం పరిమితిలో లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారని సీఎం తెలిపారు.
ఒకే విభాగం పరిధిలోకి విద్యా శాఖ నిర్మాణాలు:
విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రవారీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని, ఈ నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనం కోసం ఒకే గొడుగు కింద ఉండాలని సీఎం అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (ఈడబ్ల్యూఐడీసీ) కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని సీఎం ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్, ఇతర సిబ్బందిని వెంటనే డిప్యూటేషన్ పై తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపుకు గ్రీన్ చానల్ లో చేప్టటాలని ఈ విషయంలో ఎటువంటి అలసత్వం చూపొద్దని ఆదేశించారు.
కాంట్రాక్ట్ పద్దతిలో వ్యాయామ ఉపాధ్యాయులు:
ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద స్కూల్స్ లో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. సంక్షేమ గురుకుల పాఠశాల్లోని బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సెలర్లను నియమించాలన్నారు. రాష్ట్రంలోని మహిళా కాలేజీలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రవారీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కంటైనర్లపై సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకిష్టారెడ్డి, సాకేంతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.






