మామునూరు ఎయిర్‌పోర్టు డిజైన్ అలా ఉండాలి.. CM రేవంత్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-01 17:22:24  IST  )

వరంగల్(Warangal) మమునూరు ఎయిర్‌పోర్టు(Mamunur Airport)పై సచివాలయం వేదికగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు.

మామునూరు ఎయిర్‌పోర్టు డిజైన్ అలా ఉండాలి.. CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్(Warangal) మామునూరు ఎయిర్‌పోర్టు(Mamunur Airport)పై సచివాలయం వేదికగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్‌పోర్టు డిజైనింగ్‌ను కూడా త్వరగా పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేరళ(Kerala)లోని కొచ్చి ఎయిర్‌పోర్టు(Kochi Airport) తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టు ఉండాలని చెప్పారు. ఎయిర్‌పోర్టు వద్ద విమాన రాకపోకలతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ నగరానికి ఎస్సెట్‌గా విమానాశ్రయ నిర్మాణం ఉండాలని అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మరోవైపు మామునూరులో విమానాశ్రయం(Warangal Mamunur Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్‌ సంస్థతో ఒప్పందం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Union Minister Ram Mohan Naidu).. జీఎంఆర్‌(GMR)తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఆ సంస్థ అంగీకారం తెలపడంతో మామునూరు విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story