- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha : అప్పులు..ఆదాయంపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రచారం : కవిత
రాష్ట్ర అప్పులు..ఆదాయం(Debts And Income)పై సీఎం రేవంత్ రెడ్డి అవగాహాన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర అప్పులు..ఆదాయం(Debts And Income)పై సీఎం రేవంత్ రెడ్డి అవగాహాన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)విమర్శించారు. ప్రధాని మోడీ(Prime Minister Modi)ని కలిసిన సందర్భంలో కేసీఆర్(KCR) చేసిన అప్పులకు వడ్డీ నెలకు 6,500కోట్లు కడుతున్నామని చెప్పాడని..కాగ్(CAG) నివేదిక 2024-25మేరకు 10నెలల్లో 22వేల కోట్లు వడ్డీ మాత్రమే కట్టారని..నెలవారి వడ్డీ చెల్లింపు 2,600కోట్లు మాత్రమేనన్నారు. కేసీఆర్ 7లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక కూడా నిజాలు చెప్పకుండా మళ్లీ అబద్దాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు.
కేసీఆర్ 4.3లక్షల కోట్ల అప్పులు చేశారని..పెట్టిన ఖర్చు, అభివృద్ధి కూడా మేం అనేక పర్యాయాలు చట్టసభలలో వెల్లడించామని గుర్తు చేశారు. రాష్ట్రానికి 18వేల కోట్ల ఆదాయం వస్తుందని ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెప్పారని..యావరేజీగా చూస్తే 12వేల కోట్ల ఆదాయం వస్తుందని తేలిందని..మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని కవిత ప్రశ్నించారు. కట్టని అప్పులు కడుతున్నామని..పెరగని ఆదాయం పెరిగిందని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడం విస్మయకరమన్నారు.
రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి హైడ్రా కారణమని..స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 18వేల కోట్ల అంచనా నుంచి 5,800కోట్లకు పడిపోయిందని..అయినా అరాచకం ఆపకుండా మలక్ పేటలో నిన్న ఇండ్లు కూల్చారన్నారు. హైడ్రాతో హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తున్నారన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలో మూలనపడేయడంతోనే ఇప్పటి ప్రమాదానికి కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించడం సత్యదూరమని కవిత మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులకు సాంకేతిక అడ్డంకుల గురించి గతంలో కేసీఆర్ స్పష్టంగా అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిప పక్షానికి చెప్పారని కవిత తెలిపారు. అప్పట్లో కాంట్రాక్టర్ కు 100కోట్లు ఇచ్చారని..కరోనా సమయంలో మరోసారి అఖిల పక్షం సాక్షిగా కేసీఆర్ మరో 100కోట్ల ఇచ్చారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో 30ఏళ్లలో 3,340కోట్లు ఖర్చు చేస్తే..కేసీఆర్ పదేళ్లలో 3,890కోట్లు ఖర్చు చేసి 11.5కిలోమీటర్ల సొరంగం త్రవ్వారని..ఇంత ఖర్చు చేసి పనులు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అసలే పని చేయలేదని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడం విడ్డూరమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా సమీపంలో ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 8మంది ప్రాణాపాయంలో ఉంటే ఎన్నికల ప్రచారానికి, ఢిల్లీకి వెళ్లారని..దీనిపై ప్రశ్నిస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం సహాయక చర్యలపై మంత్రులు బాగానే పనిచేస్తున్నారంటున్నారని కవిత విమర్శించారు. సీఎం అక్కడికి పోకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ లో సీరియస్ కొరవడిందన్నారు. అదే హిమాచల్ ప్రదేశ్ లో టన్నెల్ లో 40మంది చిక్కుకుంటే సీఎం పుష్కర సింగ్ ధామి అక్కడే ఉండి సహాయక చర్యలు పూర్తయ్యేదాకా అక్కడే ఉన్నారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా నాలుగు ప్రాజెక్టులు కొట్టుకపోయాయని..మెగా కృష్ణారెడ్డి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోతే ఆర్టీఐ సమాచారం అడిగితే దేశ భద్రత సాకు చెప్పి నిరాకరించారని కవిత ఎద్దేవా చేశారు. ఏమన్నంటే పదేపదే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలుస్తారని..అయినా నిధులు సాధించడం లేదని..రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని..ప్రతిపక్ష నేతగా ఆయన కూడా రాష్ట్రానికి నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రధానిని కలిశాక రాష్ట్రానికి వచ్చిందేమిటని ప్రశ్నిస్తే.. బయటకు వచ్చాక బీఆర్ఎస్ పనైపోతుందని..వరుస చావులు, కేసులంటూ ఏదేదో మాట్లాడారన్నారు. దీనిని చూస్తే ప్రధాని, సీఎంలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కలిసిపోయారని తేలిపోతుందన్నారు. ఎంతసేపు కల్వకుంట్ల కుటుంబంపై కేసులు, వేధింపులు ఎట్లా చేయాలనే రేవంత్ రెడ్డి పని పెట్టుకున్నాడన్నారు.
ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్‌పై కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి అంటున్నారని..లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారని కవిత విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలో మా అన్న తిరుపతిరెడ్డినే అన్ని పనులు చూసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని..అలాగైతే ఎనుముల కుటుంబానికి ఓ న్యాయం..కల్వకుంట్ల కుటుంబానికి మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో వ్యవహరిస్తుందని..ఎనుముల కుటుంబంలో సభ్యుల మాదిరిగా అధికార దుర్వినియోగం చేయమన్నారు. మేము ఎప్పుడూ ప్రొటొకాల్‌ను ఉల్లంఘించలేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేత శక్తులుగా వ్యవహరిస్తున్నారని కవిత ఆరోపించారు.
ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇంచార్జి అని సీఎం చెప్పుకున్నారని..పార్టీ పరంగా ఇంచార్జి అయితే మాకు ఇబ్బంది లేదు.. కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారని..తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారని..రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కాదా? అని ప్రశ్నించారు. మా కుటుంబంలో అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికయ్యి ప్రజాసేవ చేస్తున్నామని..ముఖ్యమంత్రి సోదరులు ఇష్టారీతినా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
గుమ్మడి నర్సయ్య వంటి మహోన్నతమైన వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారని..తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్నది సీఎం దురాలోచన చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం కొట్లాడే బీఆర్ఎస్ ను బలహీన పరిచే కుట్రలను చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలన్నారు. ఎవరో చనిపోతే మా కుటుంబానికి అంటగట్టడం వెనుక కుట్ర ఉందని..ప్రధానికి కలిశాక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే మాకు కుట్ర కోణం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయన్నారు. నేను కూడా అలాగే బలి అయ్యానని కవిత చెప్పుకొచ్చారు.
న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండెపోటుతో మరణించారని..భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే రాజలింగం హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారని..దుబాయ్‌లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చిందని కవిత గుర్తు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బాకా పత్రికలలో తమ కుటుంబానికి వ్యతిరేక కథనాలతో చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
కిషన్ రెడ్డి నిధుల సాధనలో అడ్డుపడుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలపై కవిత స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ సీఎం రేవంత్ రెడ్డికి, బీజేపీకి మధ్య మంచి సంబంధాలున్నాయని వారిద్ధరు కలిసే పరస్పరం సహకరించుకుంటు పనిచేస్తున్నారన్నారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు ఎలా వస్తుందన్న మాటలే నిదర్శనమని కవిత ఆరోపించారు. ప్రధాని మోడీ డైరక్షన్ లో ఆర్ఎస్ఎస్ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని.. బీజేపీ, కాంగ్రెస్ లు ఎంపీ, ఎమ్మెల్యేలో ఎన్నికల్లో కలిసి పనిచేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీనే కాపాడుతుందని..మేం ఏదైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేంద్ర మంత్రులు మమ్మల్ని విమర్శిస్తుంటారని కవిత చెప్పుకొచ్చారు.






