ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ పర్యటన.. కేసీ వేణుగోపాల్‌తో నేతల భేటీ

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.

ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ పర్యటన.. కేసీ వేణుగోపాల్‌తో నేతల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ (శనివారం) ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుల నియామకంపై నేషనల్ అబ్జర్వర్లతో వన్ టు వన్ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణలో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల నియామకాలు చేపట్టనున్న విషయం తెలిసిందే.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.

Next Story