జర్నలిస్టులకు సూపర్ న్యూస్.. ఇండ్ల స్థలాలపై BIG అప్‌డేట్

by Gantepaka Srikanth |

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం లభించనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జర్నలిస్టులకు శుభవార్త చెబుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

జర్నలిస్టులకు సూపర్ న్యూస్.. ఇండ్ల స్థలాలపై BIG అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం లభించనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జర్నలిస్టులకు శుభవార్త చెబుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం జర్నలిస్టులతో సరదాగా గడిపిన (చిట్ చాట్) సందర్భంగా ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంపై ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు సీఎం తెలిపారు. కేబినెట్ ఆమోదం ఉంటేనే ఈ నిర్ణయానికి పూర్తి చట్టబద్ధత ఉంటుందని, భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా అడుగులు వేస్తున్నామని ఆయన వివరించారు. జూన్ 2వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, అర్హులైన జర్నలిస్టులకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ రిసోర్స్​మొబలైజేషన్​కేబినెట్​సబ్​కమిటీ ఉందని, ఆ కమిటీ సమావేశమై ఒక నివేదికను కేబినెట్​అందించే సమావేశం ఏర్పాటు అయ్యే విధంగా చూసుకోవాలని ఆయన జర్నలిస్టులకు సూచించారు. ఈ కమిటీ నివేదిక కేబినెట్​వస్తుందని, ఈనెల 21న కేబినెట్​సమావేశమై ఆమోదం తెలుపుతామన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, లే అవుట్ ఏర్పాటు చేయడం, రోడ్లు, కరెంటు, నీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులను కేబినెట్​ఆమోదంతో కేటాయిస్తామని, దీని ద్వారా జర్నలిస్టులపై భారం పడదన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

మల్లు భట్టి విక్రమార్క (డిప్యూటీ సీఎం)

ఉత్తంకుమార్ రెడ్డి

శ్రీధర్ బాబు

జూపల్లి కృష్ణారావు

ఈ సబ్ కమిటీ క్షేత్రస్థాయిలో ఉన్న సాధకబాధకాలను పరిశీలించి, కేబినెట్‌కు తన నివేదికను సమర్పించనుంది. సోమవారం మూడు జర్నలిస్టు హౌసింగ్​ సోసైటిలతో ఏర్పడిన జేఏసీ మంత్రి పొంగులేటిని కలిసి పలు విషయాలపై జేఏసీగా చేసిన తీర్మాణాలను అందించారు. రెండు మూడు రోజుల్లో జేఎన్​జే సోసైటి చేసిన తీర్మాణాల సంతకాల కాపీలను మంత్రి పొంగులేటికి అందించనున్నారు. గత 18 ఏళ్లుగా జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీతో పాటు ఇతర సొసైటీల సభ్యులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల వ్యవహారం ఇప్పుడు ఒక కొలిక్కి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకోవడం, డెడ్ లైన్ విధించడంతో జర్నలిస్ట్ లోకంలో హర్షం వ్యక్తమవుతోంది.

Next Story