Revanth Reddy: సంక్షేమ పథకాలపై కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

by Prasad Jukanti |

ప్రజాపాలన-ప్రగతిలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

Revanth Reddy: సంక్షేమ పథకాలపై కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. మంగళవారం సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'పై కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు చేశారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ (99 Days Action Plan) ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు.

ప్రతి నెల బిల్లులు:

ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి దారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లుల చెల్లింపులు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సదస్సుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

Next Story