CM Revanth : మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

by Ramesh Naini |   (  Updated:2025-12-22 17:08:09  IST  )

ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

CM Revanth : మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇవాళ (సోమవారం) మూడు గంటల పాటు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుధీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై మంత్రులను సీఎం అభినందించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం చూపాలని కీలక సూచనలు చేశారు. సర్పంచ్‌లతో మంత్రులు ఆత్మీయసమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని జెడ్పీటీసీ పీఠాలను క్లీన్ స్వీప్ చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. నదీజలాల్లో అన్యాయంపై సభలో వివరించారని తెలిపారు.

Next Story