- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chit Chat: ఇప్పటికే రెండు సార్లు లేఖలు రాశాం.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
by Prasad Jukanti |
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై దర్యాప్తు జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై దర్యాప్తు జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు అనుమతి అవసరం అన్నారు. అనుమతి కోసం ఇప్పటికే డీవోపీటీకి రెండు సార్లు లేఖ రాశామని అక్కడి నుంచి అనుమతి రాగానే చర్యలు ఉంటాయన్నారు. ఈ కేసులో కేటీఆర్ వరకు అనుమతులు వచ్చాయన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేదే మా పాలసీ అని స్పష్టం చేశారు.
కేసీఆర్ పిల్లల లాగా మేం పబ్బులకు తిప్పట్లేదు:
ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ కార్యక్రమానికి తన మనువడిని తీసుకురావడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పిల్లల లాగా మేం పబ్బులకు తిప్పట్లేదన్నారు. నా మనువడిని ప్లేయర్‍ని చేయాలని ఉంది. ఎవరికి ఏది ఇష్టమో అది చేస్తారు. అందుకే ఫుట్ బాల్ ఆడించాలనే నా మనువడిని తీసుకెళ్లానని చెప్పారు. మెస్సీ ఈవెంట్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఇది పూర్తిగా ప్రయివేట్ కార్యక్రమం అని క్లారిటీ ఇచ్చారు. మెస్సీ ఈవెంట్‌కు తాను కూడా గెస్ట్‌గా మాత్రమే వెళ్లానన్నారు. సింగరేణి యాజమాన్యం అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. ఫుట్‌బాట్ ఆడించడానికి మాత్రమే మనవడితో వెళ్లానని చెప్పారు.
చాలా మంది ఉద్యోగులు ఫేక్ ఆధార్ కార్డులు ఇచ్చారని సీఎం అన్నారు. దొంగ ఆధార్ కార్డులపై విచారణ చేయిస్తానని ఫేక్ ఆధార్ కార్డులతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తప్పవని హెచ్చిరించారు. ఈ వ్యవహారంపై ఫొరెన్సిక్ ఆడిట్ చేయిస్తానన్నారు.
Next Story






