దళితుడిని అధ్యక్షా అని పిలిచేలా చేశా: సీఎం రేవంత్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-15 09:18:10  IST  )

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ తప్పాడు. కానీ తాము అలా చేయలేదు.

దళితుడిని అధ్యక్షా అని పిలిచేలా చేశా: సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్(Sant Sevalal Maharaj) జయంతి వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ తప్పాడు. కానీ తాము అలా చేయలేదు. దళితుడిని స్పీకర్ చేసి అధ్యక్షా అని పిలిచేలా చేశామని అన్నారు. దళితులకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చాం.. స్పీకర్ పదవి ఇచ్చామని తెలిపారు. ప్రజా తీర్పును అవమానించేలా ఎవరూ మాట్లాడొద్దు.. నేనే రాజు.. నేనే మంత్రిని అని ఎక్కడా చెప్పలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు తానే బాధ్యుడిని అని చెప్పానని గుర్తుచేశారు. గెలిస్తే పొంగిపోవడం.. ఓడిపోతే కుంగిపోవడం తనకు తెలియదని అన్నారు. వచ్చే నాలుగు ఏళ్లలో నా రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు ముగుస్తాయి.. వచ్చే 20 ఏళ్లు కూడా పేదల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. నల్లమలలో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు. వచ్చే సేవాలాల్ జయంతి నాటికి పుణ్యక్షేత్రం పూర్తి చేస్తామని అన్నారు.

లంబాడా తండాలకు CM రేవంత్ గుడ్ న్యూస్

Next Story