లంబాడా తండాలకు CM రేవంత్ గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-15 09:19:07  IST  )

హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాధనలో లాంబాడా యువకులది కీలక పాత్ర అని గుర్తుచేశారు.

లంబాడా తండాలకు CM రేవంత్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్(Sant Sevalal Maharaj) జయంతి వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాధనలో లాంబాడా యువకులది కీలక పాత్ర అని గుర్తుచేశారు. తెలంగాణ పునర్:నిర్మాణంలో లంబాడాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని లంబాడా తండాలకు బీటీ రోడ్లు వేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి రోడ్లు లేకుండా రాష్ట్రంలో ఏ తండా ఉండకూదని అన్నారు. ప్రతీ తండాలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. నాలుగు నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానని సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయం గుర్తుచేశారు. ఆలోపే తండాలన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. లంబాడా యువకులు అందరూ కెరియర్‌ను గొప్పగా మల్చుకోవాలని సూచించారు. ఊర్లోనే ఉంటాం, వ్యవసాయం చేసుకుంటాం అనే ధోరణిని మైండ్‌లోంకి తీసేయాలని సూచించారు. గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, నచ్చిన రంగంలో రాణించేలా కృషి చేయాలని, అందుకు ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక క్లారిటీ ఇచ్చారు. గత పదేళ్లలో లేని విధంగా లక్షలాది కొత్త రేషన్ కార్డులు, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 8 ఏళ్లు అధికారంలో ఉంటుందని అన్నారు.

దళితుడిని అధ్యక్షా అని పిలిచేలా చేశా: సీఎం రేవంత్

Next Story