ఉగ్రవాదులతో చర్చిస్తున్నారు.. మావోయిస్టులతో చర్చలు చేయడానికి ప్రాబ్లం ఏంటి?: CM రేవంత్

by Gantepaka Srikanth |

ఆపరేషన్ కగార్‌(Operation Kagar)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదులతో చర్చిస్తున్నారు.. మావోయిస్టులతో చర్చలు చేయడానికి ప్రాబ్లం ఏంటి?: CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్‌(Operation Kagar)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టుల(Maoists Party) పట్ల కేంద్రం దయతో వ్యవహరించాలని అన్నారు. వారు లొంగిపోవడానికి ముందుకు వస్తే స్వాగతిస్తామని చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటుకు కేంద్రమే ఒక విధానం తెచ్చిందని గుర్తుచేశారు. ఉగ్రవాద సంస్థలతో చర్చిస్తున్న కేంద్రం.. మావోయిస్టులతో చర్చలకు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. మావోయిస్టుల పట్ల కఠినంగా ఉండటం సరికాదని అన్నారు. ఇక హైదరాబాద్‌ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రంలో ఉన్న కిషన్‌రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారు అని సీఎం అన్నారు. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరుతానంటే తాను ఒప్పుకోను అని స్పష్టం చేశారు.

Next Story