CM Revanth: శాంపిల్‌ స్కీమ్‌లు నేను పెట్టను

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల(Government Schemes)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth: శాంపిల్‌ స్కీమ్‌లు నేను పెట్టను
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల(Government Schemes)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని అన్నారు. పథకం గ్రౌండ్‌ వరకూ వెళ్లేలా నిత్యం సమీక్షలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తాను శాంపిల్‌ స్కీమ్‌లు పెట్టను అని స్పష్టం చేశారు. ఏదైతే అమలుకు సాధ్యం అవుతుందో అలాంటి హామీలే తాము ఇస్తామని.. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని అన్నారు. అంతకుముందు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం తెలంగాణ ప్రజలకు గర్వ కారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతిగా గెలిపించేందుకు పార్టీలకతీతంగా తెలుగు ఎంపీలు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, చంద్రబాబు, పవన్, జగన్, ఒవైసీ ఒకే మాటపై నిలబడి పార్టీలకతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉప రాష్ట్రపతిగా ఆయన్ను గెలిపించేందుకు తన వంతు కృషి తప్పకుండా చేస్తానని.. అధిష్టానం ఆదేశిస్తే స్వయంగా కేసీఆర్‌ను కలిసి మద్దతు కోరడానికి కూడా వెనుకాడబోనని అన్నారు.

Next Story