- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ క్లారిటీ: గెలిచిన 68 మంది ఎమ్మెల్యేలూ అర్హులే, కానీ 17 మందికే అవకాశం. సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) తెరదించారు. ఢిల్లీలో మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తాను కేబినెట్ విస్తరణ అంశంపై ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఎవరైనా అధిష్ఠానాన్ని కలుసుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవికి అర్హులేనని, అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేబినెట్‌లో కేవలం 17 మందికే అవకాశం ఉంటుందని సీఎం గుర్తుచేశారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు, సీనియారిటీ, పార్టీ నిబద్ధత వంటి రకరకాల కారణాలతో లోతుగా పరిశీలించిన తర్వాతే మంత్రులుగా ఎంపిక ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.






