ప్రజలకు కాపలాదారులుగా ఉంటాం: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవం ఆవశ్యకత, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ తొలి దశలో చేపట్టే ప్రాజెక్టులపై ఎంఆర్డీసీఎల్ ఇచ్చిన ప్రజెంటేషన్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రజలకు కాపలాదారులుగా ఉంటాం: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవం ఆవశ్యకత, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ తొలి దశలో చేపట్టే ప్రాజెక్టులపై ఎంఆర్డీసీఎల్ ఇచ్చిన ప్రజెంటేషన్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారు. అలాంటి ప్రజలకు కాపలాదారులుగా ఉంటాం. ప్రపంచంలోని అనేక దేశాల్లో నదీ పరివాహక ప్రాంతాలే ఎక్కువగా అభివృద్ధి చెందాయి. సింగపూర్, దుబాయ్, లండన్, సియోల్ దేశాలు తిరిగాం.. మనకు ఏం అవసరమో అక్కడ స్టడీ చేశాం. ఇతర దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ అభివృద్ధిని అందుకోవాలనే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు తలపెట్టాం. ప్రపంచంతో పడేలా మనం అభివృద్ధి చెందవద్దా. బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును వ్యక్తిరేకిస్తున్నాయి. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును గుడ్డిగా వ్యతిరేకించడం సరైందేనా. వ్యతిరేకించడాలు ఆపేయండి. అందరూ సలహాలు ఇవ్వండి. అందరి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. అందరినీ గౌరవిస్తాం. మనం ఎంత కాదనుకున్నా.. నిజాం నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. నిజాం కట్టడాలు ఇప్పటికీ మర్చిపోలేం. ఆరోజుల్లోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా చేశారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు. ఎవరినీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టదు. అందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Next Story