- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అదే నా బ్రాండ్’.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతీ ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉందని.. తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (Young India Police Schools) అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతీ ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉందని.. తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (Young India Police Schools) అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది, ఐటీని అధివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది, శ్రీరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది.. అలాగే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌న అంటే అందరికీ తానే గుర్తొస్తానని అన్నారు. ఇదే నా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరికొందరు తెలంగాణ ఉద్యమాన్ని తమ బ్రాండ్‌గా చెప్పుకొని పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఒలంపిక్స్(Olympics)లో చిన్న చిన్న దేశాలు మెడల్స్ సాధిస్తున్నాయని.. మనం దేశం ఎందుకు సాధించలేకపోతుందో ఒకసారి ఆలోచించాలని కోరారు.
రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది బీటెక్ పూర్తి చేస్తున్నారు.. విద్యార్థుల్లో నాణ్యత ఎంతంటే ఎవరి దగ్గరా సమాధానం లేదని అన్నారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కనీసం అప్లికేషన్లు కూడా నింపలేకపోతున్నారని ఆవేదన చెందారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ తీసుకొస్తున్నామని అన్నారు. సైనిక్ స్కూల్స్(Sainik Schools) తరహాలో ఈ స్కూల్స్ నిర్మిస్తామని ప్రకటించారు. దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పోలీస్ స్కూల్ అంటేనే ఓ బ్రాండ్‌గా తయారు కావాలి. త్వరలో ప్రభుత్వ స్కూళ్లలో కూడా ప్రీ స్కూల్ విధానం ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. అంతకముందు క్లాస్ రూంలను సీఎం పరిశీలించారు. కాసేపు గ్రౌండ్‌లో పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడి ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.






