- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ప్రజలు అవమానాన్ని భరించరు: సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గ్రూప్–I, గ్రూప్–II అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గ్రూప్–I, గ్రూప్–II అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో లాగా ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా అత్యంత కఠినంగా పరీక్షలు నిర్వహించామన్నారు. తాము ఇంత పక్కాగా ఉన్నా.. కొందరు ఉద్యోగాలను అమ్ముకున్నామని తమపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. అలాంటి వారికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క గ్రూపు-1 ఉద్యోగం అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఇవాళ శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులు అందరూ ఉద్యోగంలో నిబద్ధత కనబర్చాలి. నాలుగు కోట్ల ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. ఎలాంటి అప్రోచ్‌తో ఉద్యోగంలో చేరారో రిటైర్మెంట్ వరకూ అలాగే ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగంలో మూడు రకాల పరిస్థితులు ఎదురవుతాయి. 1.గరం 2.నరం 3.బేషరం.. మీరంతా మొదటి పరిస్థితి దగ్గరే ఆగిపోతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గరం, నరం, బేషరం అనే నానుడి తప్పు అని మీరంతా ప్రూవ్ చేయాలని చెప్పారు.
తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ.. అవమానాన్ని భరించరు. కాకతీయులపై వీరోచితంగా పోరాడినా సమ్మక్క - సారలమ్మలు దేవతలు అయ్యారు. నిరంకుశ నిజాంపై తిరుగుబాటు చేసిన చరిత్ర తెలంగాణ నేలకుంది. ఇక సాయుధ రైతాంగ పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వీరుల స్ఫూర్తితో ఉద్యోగాలు చేపట్టాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






