ఎర్రబస్సే కాదు.. ఎయిర్‌ బస్సును ఆదిలాబాద్‌కు తీసుకొస్తా: CM రేవంత్ ప్రకటన

by Gantepaka Srikanth |

ఎర్రబస్సే కాదు.. ఎయిర్‌ బస్సును ఆదిలాబాద్‌కు తీసుకొస్తా: CM రేవంత్ ప్రకటన

ఎర్రబస్సే కాదు.. ఎయిర్‌ బస్సును ఆదిలాబాద్‌కు తీసుకొస్తా: CM రేవంత్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంది. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నాం.. రెండేళ్ల నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న వయసులోనే నాకు ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు విపక్ష ఎమ్మెల్యేలను అనుమతించలేదని గుర్తుచేశారు.

సచివాలయంలో రాకుండా కూడా అడ్డుకున్నారు.. అన్నీ గమినంచిన ప్రజలు.. ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని దింపారు.. ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఏడాది తిరిగే లోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. ఆదిలాబాద్‌లో ఇక నుంచి ఎర్రబస్సులు కాదు.. ఎయిర్ బస్సును తీసుకొస్తా అని మాటిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంటరీ రూపొందించినట్లు చెప్పారు. పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈనెల 8న, 9న గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో మళ్లీ వస్తా.. ఒక రోజంగా ఉండి.. సమీక్షలు చేసి.. సమస్యలు తెలుసుకొని అక్కడే పరిష్కరించి పోతా అని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధిని నాదే హామీ అని ప్రకటించారు.

గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని లూటీ చేసింది. కాళేశ్వరం పేరుతో కడితే అది కూలేశ్వరం అయింది. అది వాళ్ల ఇంట్లో మాత్రం కాసులు కురిపించింది. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మించి వేల కోట్లు దోచుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏ ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారో.. అందుకు భిన్నంగా రాష్ట్రంలో పదేళ్ల పాలన సాగిందని మండిపడ్డారు. సోనియా గాంధీ కలలుగన్న తెలంగాణను త్వరలోనే తీర్చి దిద్దుతామని అన్నారు.

Next Story