- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జపాన్‌కు CM రేవంత్.. వెంట కీలక మంత్రి
by Gantepaka Srikanth |
సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయల్దేరుతున్నారు. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం పర్యటనలో పాల్గొంటారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయల్దేరుతున్నారు. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం పర్యటనలో పాల్గొంటారు. కాగా.. 16 నుండి 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమాలో సీఎం బృందం పర్యటిస్తుంది. ఓసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తుంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు నిర్వహించనున్నారు.
Next Story






