గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) మొదలయ్యాయి.

గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnudev Varma) సభను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్ చేసిన ప్రసంగాన్ని అధికార పక్ష సభ్యులు స్వాగతిస్తుండగా.. ప్రతిపక్ష సభ్యులు (Oppositiona) విమర్శలు (Criticized) చేస్తున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగంపై (Governor Speech) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో గవర్నర్ నిష్పాక్షికంగా ప్రజా కోణాన్ని వెల్లడించారని అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ (Twitter) లో రేవంత్ రెడ్డి.. గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. దీనిపై ఆయన.. ప్రజా పాలన (People Governance) లో ఉజ్వల పునర్ నిర్మాణం దిశగా తెలంగాణ రాష్ట్రం (Telangana State) వడివడిగా అడుగులు వేస్తోందని అన్నారు.

అలాగే అన్నీ రంగాల్లో అద్భుత ప్రగతికి గొప్ప బాటలు వేసుకుంటోందని, ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ.. గత పాలకుల పాపాలను పరిష్కరిస్తూ.. ఆకాశమే హద్దుగా వృద్ధిని సాధించే విశ్వాసాన్ని ప్రదర్శిస్తోందని తెలిపారు. ఇక ఈ రోజు ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగం సకల జన సంక్షేమాన్ని, సమస్త రంగాల అభివృద్ధిని, నిజాయితీగా, నిష్పాక్షికంగా ప్రజా కోణంలో వెల్లడించిందని రేవంత్ రాసుకొచ్చారు. కాగా అసెంబ్లీ సమావేశాల అనంతరం జరిగిన బీఏసీ సమావేశాల్లో (BAC Meeting) శాసనసభ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు జరపాలని నిర్ణయించారు. ఈ నెల 13న అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు (Thanks) తేలిపే తీర్మాణం ఉంటుంది. తర్వాత ఈ నెల 14 హోలీ సెలవు (Holy Holiday) అనంతరం ఈ నెల 19 ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Finance Minister Mallu Bhatti Vikramarka) అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ (Budget) ను ప్రవేశ పెట్టనున్నారు.

Next Story