- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: నేను పేదవాడిని కాదు కానీ.. ఆ విషయం నాకు తెలుసు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి గత ప్రభుత్వంపై, కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి గత ప్రభుత్వంపై, కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మూసీ ప్రాజెక్టు, మరియు ప్రధాని మోడీ పనితీరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నా చేతికి అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే తాము అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 11.90 శాతం భారీ వడ్డీకి రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేసిందని, దీనిపై ఇప్పటికే తాము శ్వేతపత్రం (White Paper) విడుదల చేశామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, కేవలం ఆర్థిక కారణాల వల్ల ప్రస్తుతం రెండు పథకాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు.
గుజరాత్ వర్సెస్ హైదరాబాద్: మోడీపై విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీ తీరును తప్పుబడుతూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ దేశం మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలి, కానీ ఆయన కేవలం గుజరాత్‌కే అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు. పెట్టుబడులన్నీ గుజరాత్‌కే తరలిపోతున్నాయని ఆరోపించారు. అహ్మదాబాద్‌కు, హైదరాబాద్‌కు పోలిక లేదని, హైదరాబాద్ ఒక 'రేర్ నగరం' అని కొనియాడారు. తెలంగాణ కూడా దేశంలో భాగమేనని కేంద్రానికి గుర్తు చేశారు. హైదరాబాద్‌లో తాము చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును బీజేపీ నేతలు అడ్డుకోవడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ చెప్పినట్లుగానే బీజేపీ నేతలు నడుచుకుంటున్నారని, రెండు పార్టీలు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు.






