అవకాశం ఇస్తే ఏదైనా సాధించగలమని నిరూపించారు: CM రేవంత్ ప్రశంస

by Gantepaka Srikanth |

అవకాశం ఇస్తే ఏదైనా సాధించగలమని నిరూపించారు: CM రేవంత్ ప్రశంస

అవకాశం ఇస్తే ఏదైనా సాధించగలమని నిరూపించారు: CM రేవంత్ ప్రశంస
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన అంతర్జాతీయ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ సాధించిన భారత మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాభినందనలు తెలియజేశారు. ఫైనల్స్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి చైనీస్ తైపీపై 35-28 పాయింట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుని భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటారని కొనియాడారు. అవకాశం ఇస్తే తమలోని ప్రతిభా పాటవాలని ప్రదర్శించి విజేతలుగా నిలుస్తారనడానికి మన మహిళలు నిదర్శనమని అన్నారు. మహిళల జట్టు విజయం ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. కాగా, భారత్ వరుసగా రెండో టైటిల్‌ను దక్కించుకుంది. ఈ టోర్నీని తొలిసారిగా 2012లో నిర్వహించగా అప్పుడు కూడా భారత జట్టే ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది నిర్వహించిన పోటీల్లోనూ భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.

Next Story