మహిళా రైతు తారవ్వను ఆదుకున్న రేవంత్ సర్కార్..

by Ramesh Naini |

సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొట్టుకుపోయిన మహిళా రైతు తారవ్వను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది.

మహిళా రైతు తారవ్వను ఆదుకున్న రేవంత్ సర్కార్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొట్టుకుపోయిన మహిళా రైతు తారవ్వను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. బుధవారం మొంథా తుఫాన్ ప్రభావంతో హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న వరి ధాన్యం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అందులోనూ మహిళా రైతు తారవ్వ వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది. డ్రైనేజీలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని దోసిళ్లతో ఏరుకుంటూ ఆమె రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ క్రమంలోనే మహిళా రైతు తారవ్వ అక్కడికి వచ్చిన అధికారులు, కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలపించింది.

అయితే, జిల్లా కలెక్టర్ ఆమెకు భరోసా ఇచ్చారు. కొట్టుకుపోయిన మొత్తం ధాన్యానికి తాజాగా డబ్బులు ఆమెకు చెల్లించారు. దాదాపు 106 క్వింటాళ్ల వరి ధాన్యం కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారు. క్వింటాలుకు రూ.2390 మద్దతు ధరతో రెండు లక్షల 55 వేల 145 రూపాయలను మహిళా రైతు ఖాతాలో రేవంత్ సర్కార్ జమ చేసింది. ఈ సందర్భంగా సీఎంకు మహిళా రైతు తారవ్వ ధన్యవాదాలు తెలిపారు.

Next Story