- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంత ఖర్చయినా సరే.. పూర్తిచేసే తీరుతా: CM రేవంత్ కీలక ప్రకటన
ఎంత ఖర్చయినా సరే.. పూర్తిచేసే తీరుతా: CM రేవంత్ కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా, మక్తల్‌లో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ రెండేళ్ల విజయోత్సవ సభను మొదట మక్తల్‌లో నిర్వహించురకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. పాలమూరు ప్రజలు అరిగోస పడుతున్నా.. ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. అందుకే ఈసారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారు.. తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరూ సీఎం కాలేదు.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాష్ట్ర సీఎంగా మీ బిడ్డకు అవకాశం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేసే బాధ్యత తనదని అన్నారు. ఇప్పటికే నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అందుకే ప్రజా పాలన వారోత్సవాలు ఇక్కడి నుంచి మొదలు పెట్టామని చెప్పారు.
కొందరు కుట్రపూరితంగా నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారిన ఫైర్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏది ఆగదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన ఏ రైతును కూడా అన్యాయం చేయబోమని.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మాయగాళ్ల మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధిని అడ్డుకోవద్దని రైతులను కోరారు. ఎంత ఖర్చు అయినా సరే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌ను ప్రధాన అంశాలుగా తీసుకున్నట్లు చెప్పారు.
కేవలం వలసలే పాలమూరు బిడ్డలను విద్యకు దూరం చేశాయి. జిల్లాలో ప్రతీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామని తెలిపారు. ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతో చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్నినియోజకర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని అన్నారు.






