- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: శ్రీవారి సేవలో సీఎం రేవంత్ కుటుంబం..
by Ramesh Naini |
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి తిరుమలకు వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం సతీమణి, కూతురు, అల్లుడు, మనుమడితో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (శ్రీవారిని) వారిని దర్శించుకున్నారు. కాగా, ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముక్కోటి దేవతలతో కలిసి ఉత్తర ద్వార దర్శనమిచ్చే శ్రీమహావిష్ణువు దివ్యానుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
Next Story






