- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: రైతు దంపతులతో ఫోటో.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్
by Prasad Jukanti |
రైతు దంపతులతో ఫోటోపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రొ.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో నిన్న జరిగిన రైతు నేస్తం (Rythu Nestam) కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ ట్వీట్ (CM Revanth Reddy Tweet) చేశారు. కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి సందర్భంగా రైతు దంపతులు వెంకటరామయ్య, లక్ష్మమ్మలను సీఎం అభినందించారు. వారితో ఫొటో దిగారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘వయసు మీదపడ్డా సాగులో అలసిపోని సేద్యపు సైనికులు ఈ పెద్దవ్వ, పెద్దయ్య. వ్యవసాయం అంటే సమాజానికి చేసే సాయం అని నమ్మే దంపతులు వీళ్లు. నేటి తరం రైతుకు ఆదర్శం వీళ్లు. వాళ్లతో దిగిన ఈ ఫొటో నాకు ఎప్పటికీ ప్రత్యేకం’ అని ట్వీట్ చేశారు.
Next Story






