- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి CM రేవంత్.. మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ
జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election)లో మూడు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election)లో మూడు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో వేగం పెంచాయి. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ ముగియడంతో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎన్నికల గుర్తులను కూడా కేటాయించింది. దీంతో అభ్యర్థులంతా ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టించే యత్నాల్లో మునిగిపోయారు. అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్, బీజేపీ.. ఇలా మూడు పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. అయితే అధికార కాంగ్రెస్‌కు ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బరిలోకి దిగబోతున్నారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. నగరంలోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారని తెలిపారు.






