- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారు.. వివరాలు ఇవే!
రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల (Prajapalana Vijayostavalu) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రతి జిల్లాలో ప్రజాసభలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రజాసభలు విజయవంతం కావాలన్న ఉద్దేశంతో వేదికలు, రవాణా, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రజాపాలనలో రెండేళ్ల సాధనను ప్రజలకు వివరించడానికి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను తెలియజేయడానికి ఈ సభలు ఉపయోగపడనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం పర్యటన ఇలా..
డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం
డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్
డిసెంబర్ 4న ఆదిలాబాద్
డిసెంబర్ 5న నర్సంపేట
డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ






