- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల బరి నుంచి మేము తప్పుకుంటాం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సంచలన సవాల్
ఎన్టీఆర్‌ను కులం, ప్రాంతంతో పోల్చడం బుద్ధిలేనితనం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రైతు డిస్కంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ బీఆర్ఎస్‍కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలెంజ్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోమని, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అని సవాల్ చేశారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచెందుకే రైతు డిస్కం అని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కంకు కనెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశామని రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు. రైతు డిస్కంపైన ఈఆర్‍సి పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తోందని అప్పుడే డిస్కంలో ఉద్యోగులు లేరని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు డిస్కం వద్దన్న వారు దాని గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
బస్సు యాత్రలు చేసిన వారింటికి ట్రాక్టర్లపై వస్తాం:
బీజేపీ, బీఆరెస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని సీఎం విమర్శించారు. వడ్లు కొనుగోలు చేయనిది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించి వదిలేస్తే మా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. మీ ప్రభుత్వం కొన్నది ఎంత మేం కొంటున్నది ఎంత? అని ప్రశ్నించారు. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుందని మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే బస్సులు వేసుకుని యాత్రలు చేసిన బీజేపీ నేతల ఇళ్లకు ట్రాక్టర్లపై వచ్చి ధాన్యం పోస్తామని హెచ్చరించారు. 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజు వరకు కొనుగోలు చేశామని , తడిచిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొనుగోలు చేశామన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ కోసం మోడీ ఆ పని చేయలేరా?
జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోడీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా స్పందించడంచడం లేదన్నారు. పోలవరం కోసం 7 మండలాలు ఇచ్చిన మోడీ తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించలేరా అన్నారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ దోచుకుందని సీఎం ఆరోపించారు. స్టోన్ క్రషర్ల దగ్గర 50 లక్షలు వసూలు చేశారని ఇదుల కుంట చెర్వు గురించి ఎందుకు హరీశ్ రావు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు.
ఎన్టీఆర్ విగ్రహం.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై..
ఎన్టీఆర్ విగ్రహం విషయంలో జరుగుతున్న చర్చపై సీఎం స్పందించారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టలేదా అని సీఎం ప్రశ్నించారు. కమ్మ సంఘానికి కేసీఆర్ 10 ఎకరాలు ఇవ్వలేదా? అని నిలదీశారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టిందే నేను అన్నారు. ఎన్టీఆర్‍ను కులం ప్రాంతంతో పోల్చడం బుద్ధి లేని తనం అన్నారు. ఆంధ్రలో తెలంగాణ వాళ్ల విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదని అక్కడ పార్టీ పెట్టిన కేసీఆర్ అడగలేదు కదా అన్నారు. వివాదాలు, సెంటిమెంట్‍తో రాజకీయాలు చేయాలని నేను అనుకోవడం లేదని నా దృష్టి అంతా అభివృద్ధి పైనే ఉందన్నారు. జీహెచ్‍ఎంసీ ఎన్నికకు తొందర లేదన్నారు.






