లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం.. ప్రధాని మోడీకి CM రేవంత్ మరో లేఖ...

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-14 13:04:10  IST  )

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మరో కీలక లేఖ రాశారు.

లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం.. ప్రధాని మోడీకి CM రేవంత్ మరో లేఖ...
X

దిశ, వెబ్‌డెస్క్: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మరో కీలక లేఖ రాశారు. ఈ లేఖలో మూడు అంశాలను కీలకంగా ప్రస్తావించారు. లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం, మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు, డీలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరికాదు అంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని, దీనిపై జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చలు జరపాలని ఆయన కోరారు. నియోజకవర్గాల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందుకోసం తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల పెంపు చేపడితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతోనే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దక్షిణాది గొంతుక...

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరి, దక్షిణాది ప్రాధాన్యత తగ్గుతుందనే ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రాసిన ఈ లేఖ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story