తెలుగువారికి గర్వకారణం.. ‘ప‌ద్మ’ అవార్డు గ్రహితలకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

by Ramesh Naini |

రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది.

తెలుగువారికి గర్వకారణం.. ‘ప‌ద్మ’ అవార్డు గ్రహితలకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. ఈ అవార్డులకు 11 మంది తెలుగు ప్రముఖులు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, సహా రాజకీయ నాయకులు, ప్రముఖులు వారికి విషెస్ తెలియజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రతిష్టాత్మక ప‌ద్మ భూష‌ణ్‌, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖులకు నా అభినందనలు, శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

‘తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వ్యాధి నిపుణులు నోరి ద‌త్తాత్రేయుడుకి ప‌ద్మ భూష‌ణ్‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ రంగం నుంచి గ‌డ్డ‌మ‌ణుగు చంద్ర‌మౌళి, కృష్ణ‌మూర్తి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యన్‌, కుమార‌స్వామి తంగ‌రాజ్, వైద్య రంగంలో గూడూరు వెంక‌ట్ రావు, పాల్కొండ విజ‌యానంద్ రెడ్డి, ప‌శుసంవ‌ర్థ‌క రంగంలో మామిడి రామా రెడ్డి, విద్యా-సాహిత్య రంగాల నుండి మామిడాల జగదీశ్ కుమార్, వెంపటి శశి శేఖర్, వెంపటి కుటుంబ శాస్త్రి, క‌ళా రంగం నుంచి దీపికా రెడ్డి, ముర‌ళీ మోహ‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, గ‌రిమెళ్ల బాల‌కృష్ణ ప్ర‌సాద్ ల‌కు ప‌ద్మశ్రీ పుర‌స్కారాలు ద‌క్క‌డం హర్షించదగ్గ విషయం’ అని వెల్లడించారు. ఇది తెలుగు వారికి గర్వకారణం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story