- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deepthi Jeevanji: పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి విషెస్
by Ramesh Naini |
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జాతీయ క్రీడాకారులకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జాతీయ క్రీడాకారులకు (Sports Awards) అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ క్రీడాకారిణి (Paralympic) పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవాంజి (Deepthi Jeevanji) అర్జున అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక ప్రకటనలో అథ్లెట్ దీప్తి జీవాంజికి విషెస్ తెలియజేశారు.
మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవాంజి అంటూ సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా మెరుగైన స్పోర్ట్స్ పాలసీతో ప్రజా ప్రభుత్వం ముందుకుపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
Next Story






