- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. CM రేవంత్ కీలక పిలుపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, మీలోని ప్రతిభను నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వలమైన భవిష్యత్తుకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
ఆదిలా ఉంటే.. పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంగా అధికారులు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా నమూనా OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మాట్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.






