CM Revanth Reddy : ఈ నెల 8న యాదగిరిగుట్టను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు.

CM Revanth Reddy : ఈ నెల 8న యాదగిరిగుట్టను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్ట సందర్శన నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. స్థానిక ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా యాదగిరి గుట్ట వద్ద హెలిప్యాడ్ ను అధికారులతో కలిసి పరిశీలించారు.

అటు యాదగిరి గుట్ట దేవస్థానం అధికారులు కూడా సీఎం రాక సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలలో నిమగ్నమయ్యారు. కార్తీక మాసం క్రమంలో భక్తులకు ఇబ్బంది కల్గకుండా సీఎం పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు. తన యాదగిరి గుట్ట పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Next Story