Jai Hind Rally: కాసేపట్లో బాచుపల్లిలో జైహింద్‌ ర్యాలీ.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

by Ramesh Naini |

కాంగ్రెస్​ పార్టీ తలపెట్టిన జై హింద్ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Jai Hind Rally: కాసేపట్లో బాచుపల్లిలో జైహింద్‌ ర్యాలీ.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు దేశం యావత్తూ అండగా ఉందని సంఘీభావంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా (Congress) కాంగ్రెస్​ పార్టీ తలపెట్టిన (Jai Hind Rally) జై హింద్ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొంటారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు (Bachupally) బాచుపల్లి వీఎన్​ఆర్​ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు జై హింద్ యాత్ర కొనసాగుతుంది.

అలాగే నిజాంపేట కొలన్ గోపాల్ రెడ్డి కన్వెన్షన్‌లో బహిరంగ సభా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, తదితర పార్టీ నేతలు ఈ యాత్రలో పాల్గొంటారు.

Next Story