- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: రేపు అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ అంత్యక్రియలకు (Andesri funeral) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరుకానున్నారు. రేపు ఘట్ కేసస్ ఎన్ఎఫ్‍సీ నగర్ లో అందెశ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం అందెశ్రీ భౌతికకాయానికి నివాళి అర్పించనున్న సీఎం అనంతరం అందెశ్రీ ఆప్తులు, అభిమానులతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. కాగా ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించిన అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ కె.రామకృష్ణరావును ఇప్పటికే ఆదేశించారు. మరో వైపు పశువుల కాపరి నుంచి ప్రసిద్ధ కవిగా ఎదిగిన అందెశ్రీ మరణం పట్ల పలవురు ప్రముఖులు, సాహితీ వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Next Story






