CM Revanth Reddy : నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Muthe.Rajitha |

రెండు రోజుల ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.

CM Revanth Reddy : నేడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజుల ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి(H.D Kumaraswamy)తో సీఎం భేటీ కానున్నారు. అనంతరం.. మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పలు అనుమతులు, నిధుల గురించి విన్నవించనున్నారు. కాగా వారం రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేటి రాత్రి సింగపూర్(Singapoor) వెళ్లనున్నారు. సింగపూర్ లో రెండు రోజుల పర్యటన అనంతరం సీఎం దావోస్(Davos) లో జరగనున్న వరల్డ్ ఎనకమిక్ ఫోరం(WEF) లో పాల్గొననున్నారు. నిన్న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. రాజధాని నగరంలోని తన అధికారిక నివాసంలో రాష్ట్రంలోని వివిధ శాఖల మంత్రులతో, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Next Story