CM Revanth Reddy: మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు వారితో కీలక సమావేశం

by Prasad Jukanti |   (  Updated:2025-11-12 08:55:31  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పర్యటనకు వెళ్లబోతున్నారు.

CM Revanth Reddy: మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు వారితో కీలక సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ రేపు ఉదయం 9 గంటలకు యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (US-India Strategic Partnership Forum) సమావేశంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు.

అధిష్టానం పెద్దల వద్దకు:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత నిర్మాణంలో భాగంగా డీసీసీల నియామకం విషయంలో ఏఐసీసీ నేతలోతో భేటీ అయి చర్చిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు సానుకూతల ఉందని అంచనా వేసిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story