- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : జైపూర్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం సాయంత్రం జైపూర్(Jaipur) వెళ్లారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం సాయంత్రం జైపూర్(Jaipur) వెళ్లారు. తన బంధువులకు సంబంధించిన శుభకార్యం ఉండడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జైపూర్‌కు బయలుదేరి వెళ్లారు. శుభకార్యం అనంతరం ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. కాగా రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏఐసీసీ(AICC) పెద్దలను కలిసి రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా సమాచారం. సీఎం ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు(TPCC Cheif), ఇతర ముఖ్యనేతలు కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై పలు వినతులను సిఎం రేవంత్‌రెడ్డి అందచేసే అవకాశం ఉందని సమాచారం.
Next Story






